మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (19:22 IST)

విద్యార్థినిపై అసభ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని... ఉపాధ్యాయుడిపై గ్రామ‌స్తుల దాడి

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు జెడ్పీ స్కూల్ ఉపాధ్యాయుడిపై దాడి జ‌రిగింది. వై. ర‌విబాబు అనే ఉపాధ్యాయుడి క్లాస్ రూమ్ వ‌ద్ద‌కు వ‌చ్చి, ఆయ‌న్ని బ‌య‌ట‌కి పిలిచి మ‌రీ. గ్రామ‌స్తులు కొంద‌రు దాడికి పాల్ప‌డ్డారు. క్లాస్ రూమ్ నుంచి కొట్టుకుంటూ, స్కూలు క్యాంప‌స్ లో హ‌ల్ చ‌ల్ చేశారు. ఇందంతా వీడియో తీశారు. 
 
ఉపాధ్యాయుడు ర‌విబాబు ఒక విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని స్కూల్ పైకి వచ్చిన బంధువులు ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డారు. ర‌విబాబును తీవ్రంగా కొట్టారు. తోటి ఉపాధ్యాయులు, పాఠ‌శాల సిబ్బంది అడ్డుప‌డినా విన‌కుండా, దాడి చేశారు. 
 
అయితే, తాను తప్పుగా ప్రవర్తించలేదని, చదువు విషయంలో మందలించానని ఉపాధ్యాయుడు చెపుతున్నాడు. అయినా, టీచర్ పై ముకుమ్మడి దాడికి పాల్పడ్డారు విద్యార్థి బంధువులు. అడ్డుకోబోయిన తోటి ఉపాధ్యాయులపై కూడా దాడి చేశారు. దీనితో పాఠ‌శాల‌లో ఏం జరుగుతోందో తెలియక తోటి  విద్యార్దులు భ‌య‌కంపితుల‌య్యారు.