శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 31 జులై 2018 (16:46 IST)

అక్క ప్రేమలో పడిందనీ లవ్‌లో పడిన బాలిక... వాడుకుని వదిలేసిన ప్రియుడు...

చెల్లి ప్రేమలో పడిందనీ ఓ యువతి కూడా ప్రేమలో మునిగిపోయింది. ఆ తర్వాత ప్రేమించిన యువకుడితో లేచిపోయి పెళ్లి చేసుకుంది. రెండు నెలలు కాపురం చేశాక.. ఆ భర్త పత్తాలేకుండా పారిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన

చెల్లి ప్రేమలో పడిందనీ ఓ యువతి కూడా ప్రేమలో మునిగిపోయింది. ఆ తర్వాత ప్రేమించిన యువకుడితో లేచిపోయి పెళ్లి చేసుకుంది. రెండు నెలలు కాపురం చేశాక.. ఆ భర్త పత్తాలేకుండా పారిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
విశాఖకు చెందిన పూర్ణ అనే మైనర్ బాలిక తనకు వరసకు అక్క అయ్యే అమ్మాయి - మరో అబ్బాయి ప్రేమించుకోవడం చూసింది. వారిద్దరి ప్రేమకు ఆకర్షితురాలై ఆ సమయంలో తనకు కనిపించిన యోగేంద్ర అనే యువకుడుతో ప్రేమలో పడింది. అనంతరం గత జనవరి నెల 20వ తేదీన వైజాగ్ బీచ్‌లో యుగేంద్ర - పూర్ణ పెళ్లి చేసుకున్నారు. 
 
ఆ తర్వాత  అక్కడ నుంచి పారిపోయి మరో ప్రాంతంలో అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. రెండు నెలల వైవాహిక జీవింతలో అప్పుడే పిల్లలు వద్దంటూ ఓసారి అబార్షన్ కూడా చేయించాడు. ఇంతలో ఉన్నట్టుండి యుగేంద్ర తన భార్య పూర్ణను పుట్టింట్లో వదిలి వెళ్లిపోయాడు. అప్పటికిగానీ ఆ బాలికకు తాను మోసపోయినట్టు తెలుసుకోలేక పోయింది. ఆ తర్వాత తన భర్త ఆచూకీ తెలుసుకోగా అతను గుంటూరు వాసిగా గుర్తించింది. చివరకు గుంటూరు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తంమీద ఈ ప్రేమ కథ వైజాగ్ నుంచి గుంటూరుకు చేరుకుంది.