శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 జులై 2018 (09:48 IST)

ఏడో తరగతి బాలికపై అత్యాచారం...

వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో ఏడో తరగతి చదివే బాలికపై 27 యేళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం మూడు నెలలుగా సాగుతూ వచ్చింది. చివరకు బాలిక తల్లి గుర్తించి నిలదీయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ

వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో ఏడో తరగతి చదివే బాలికపై 27 యేళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం మూడు నెలలుగా సాగుతూ వచ్చింది. చివరకు బాలిక తల్లి గుర్తించి నిలదీయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
హన్మకొండలోని తిరుమల బార్‌ సమీపంలో ఓ మహిళ(భర్తకు దూరంగా) తన కూతురు(11)తో కలిసి నివాసం ఉంటూ కూరగాయలు అమ్ముతూ జీవనం గడుపుతోంది. మగదిక్కు లేని ఆ కుంటుంబానికి ఐలయ్య (27) అనే వ్యక్తి దగ్గరయ్యాడు. అతను కూడా కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. 
 
ఈ క్రమంలోనే 7వ తరగతి చదువుతున్న బాలికపై కన్నేసి, ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. తల్లి సమయంలో ఐలయ్య ఇంట్లోకి వెళ్ళి బాలికను అత్యాచారం చేయసాగాడు. ఇలా గత మూడు నెలలుగా చేస్తూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో రాత్రి వేళ బాలికను సదరు వ్యక్తి పక్కకు తీసుకెళ్ళేందుకు ప్రయత్నం చేయగా, బాలిక తల్లి గమనించి నిలదీసింది. ఈ విషయం బయటకు చెపితే ఇద్దరినీ చంపేస్తానని బెదిరించాడు. అయితే, ఆ బాలిక తల్లి మాత్రం ఈ బెదిరింపులకు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.