శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 23 జులై 2018 (17:35 IST)

పేరుకే మహిళా సంరక్షణ కేంద్రం.. నిద్రపోవాలంటే.. బట్టలూడదీసి.. నగ్నంగా..?

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోభేదం లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇలా అత్యాచారాలకు గురైన తర్వాత కూడా మహిళలకు నిందితులు నరకం చూపిస్తున్నారు. చివరికి మహిళా సంరక్షణా క

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోభేదం లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇలా అత్యాచారాలకు గురైన తర్వాత కూడా మహిళలకు నిందితులు నరకం చూపిస్తున్నారు. చివరికి మహిళా సంరక్షణా కేంద్రాల్లోనూ మహిళలపై వేధింపులు తప్పట్లేదు. అఘాయిత్యులా ఆగట్లేదు.
 
తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ పూర్‌లో దారుణం చోటుచేుసుకుంది. మహిళా సంరక్షణా కేంద్రంలో అత్యాచారాలకు గురవుతున్న అమ్మాయిల కేసును ఛేదించేందుకు వెళ్లిన పోలీసులకు మరిన్ని షాకింగ్ నిజాలు తెలిశాయి. ముజఫర్‌పూర్‌లోని మహిళా సంరక్షణ కేంద్రంలో కొంతకాలం వుంటున్న 40 మంది మైనర్ బాలికలు నరకం అనుభవిస్తున్నారు. వారిని బలవంతంగా బట్టలూడదీయించి.. నగ్నంగా నిద్రపెడుతున్నారని పోలీసులు గుర్తించారు. 
 
అక్కడ పనిచేసే కిరణ్ అనే ఉపాధ్యాయురాలు మైనర్లపై దారుణానికి ఒడిగట్టుతోందని.. ఆమె కూడా వారితోపాటు వివస్త్రగా మారి నిద్రిస్తోందని పోలీసు వర్గాలు తెలిపాయి. సంరక్షణాలయం అధికారులకు సహకరించలేదన్న ఆగ్రహంతో ఓ బాధితురాలిని కొట్టి చంపారన్న ఆరోపణలపై సోదాలకు వెళ్లిన పోలీసులకు, అక్కడ ఆశ్రయం పొందుతున్న అమ్మాయిలు భయంకర నిజాలను పూస గుచ్చినట్టు చెప్పారు. ఓ అమ్మాయిని చంపి అదే ప్రాంతంలో నాలుగ్గోడల మధ్య పాతి పెట్టారని కొందరు చెప్పడంతో.. మృతదేహాన్ని వెలికితీసే పనిలో పడ్డారు పోలీసులు. అంతేగాకుండా ఈ షెల్టర్‌కు చెందిన 25 మంది మైనర్ బాలికలు అత్యాచారానికి గురైనట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. 
 
కాగా, దాదాపు నెల రోజుల క్రితం ముజఫర్ పూర్ షెల్టర్ హోమ్ ఉదంతం వెలుగులోకి రాగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసు పెట్టిన పోలీసులు హోమ్ స్టాఫ్ మెంబర్స్, ప్రభుత్వ ఉద్యోగులు సహా మొత్తం 10 మందిని ఇప్పటివరకూ అరెస్ట్ చేశారు. అక్కడున్న బాధితులను వేరే జిల్లా షెల్టర్‌లకు తరలించారు. ఇక ఇలాంటి ఘోరాలు జరుగుతున్నా.. అమ్మాయిలను కాపాడటంలో నితీశ్ కుమార్ సర్కారు విఫలమైందని విపక్ష నేత తేజస్వీ ప్రతాప్ యాదవ్ ఆరోపించారు.