శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 అక్టోబరు 2016 (11:42 IST)

మెడికో సూసైడ్ కేసులో ప్రొఫెసర్ లక్ష్మిని సస్పెండ్ చేసిన మంత్రి కామినేని

గుంటూరు జిల్లాలో ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు కారణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా ప్రొఫెసర్‌ను ఏపీ వైద్య మంత్రి కామినేని శ్రీనివాస్ సస్పెండ్ చేశారు. గుంటూరు వైద్య కాలేజీ గైనకాలజీ పీజీ విద్యార్థిని

గుంటూరు జిల్లాలో ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు కారణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా ప్రొఫెసర్‌ను ఏపీ వైద్య మంత్రి కామినేని శ్రీనివాస్ సస్పెండ్ చేశారు. గుంటూరు వైద్య కాలేజీ గైనకాలజీ పీజీ విద్యార్థిని సంధ్యారాణి మహిళా ప్రొఫెసర్ వేధింపుల కారణంగా విషపు ఇంజెక్షన్ వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. ఈ ఘటన సోమవారం జరిగింది. 
 
ప్రొఫెసర్ లక్ష్మి వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సంధ్యారాణి తన సూసైడ్ నోట్‌ కూడా రాసిపెట్టింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై స్పందించిన మంత్రి కామినేని ప్రొఫెసర్ లక్ష్మిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. 
 
అంతేకాకుండా, ఈ కేసులో విచారణ జరుగుతుందని, సంధ్యారాణి మృతికి కారణమైన వారిని చట్టం ముందు నిలుపుతామని స్పష్టం చేశారు. సంధ్యారాణి కుటుంబాన్ని ఆదుకుంటామని, జూనియర్ డాక్టర్లు ఆందోళన విరమించి విధులకు, తరగతులకు హాజరు కావాలని ఆయన కోరారు. 
 
కాగా, ఓ గర్భిణికి చికిత్స చేసే విషయంలో సంధ్యారాణి సరిగ్గా స్పందించని కారణంగా కడుపులోనే బిడ్డ మరణించిందని, ఈ కారణంతో ఆందోళన చెంది ఆమె ఆత్మహత్యకు పాల్పడి వుండవచ్చని ప్రొఫెసర్ లక్ష్మి వివరణ ఇచ్చారు. తన 23 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఏ విద్యార్థినినీ వేధించలేదని ఆమె చెప్పుకొచ్చారు.