శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: సోమవారం, 19 జులై 2021 (20:52 IST)

క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించిన హంపి పీఠాధిప‌తి విద్యారణ్య స్వామి

విజ‌య‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్దానాన్ని కర్ణాటక లోని హంపి పీఠాధిపతులు విరూపాక్ష విద్యారణ్య స్వామీజీ ద‌ర్శించుకున్నారు. ఆయ‌న‌కు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రెటరీ డా.జి.వాణీ మోహన్,  ఆలయ కార్యనిర్వహణాధికారి తి డి.భ్రమరాంబ ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అనంతరం స్వామి  అమ్మవారి దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు స్వామీజీకి వేద స్వస్తి పలికారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు, ఎన్. సుజాత, వైదిక కమిటీ సభ్యులు, ప్రధానార్చకులు స్వామీజీకి పూలు, పండ్లు అమ్మవారి ప్రసాదములను సమర్పించారు. ఈ సంద‌ర్భంగా స్వామీజీ త‌మ అనుగ్రహ భాషణం చేశారు.

అనంతరం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు స్వ‌యంగా స్వామీజికి మల్లేశ్వరస్వామి వారిని దర్శనం కల్పించి, ప్ర‌త్యేక పూజలు నిర్వహించారు. అమ్మ‌వారి వైభ‌వం భ‌క్తులంద‌రికీ మ‌హ‌ద్భాగ్య‌మ‌ని హంపి పీఠాధిపతులు విరూపాక్ష విద్యారణ్య స్వామీజీ ఆశీర్వ‌చ‌నాలు ప‌లికారు.