నిరుద్యోగ యువత ఛలో విజయవాడ రణరంగం...
ఛలో విజయవాడ అంటూ, ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువత, వివిధ పార్టీల అనుబంధ సంఘాల వారు దండెత్తడంతో నగరం రణరంగంలా మారింది. యువకులు పెద్ద పెట్టున సీఎం ఇంటికి బయలుదేరుతున్నారని, పోలీసులు వారిని ఎక్కడి కక్కడ అరెస్టులు చేశారు.
విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద పోలీసులు, యువకుల ప్రతిఘటనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వందలాది మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాలు అడిగితే అక్రమ అరెస్టులా...అని యువకులు నినదించారు. కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ఛలో విజయవాడ కార్యక్రమానికి బయల్దేరిన పలు జిల్లాలు, మండల స్థాయి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
వారిలో కొంత మందిని గవర్నర్ పేట, నున్న, అజిత్ సింగ్ నగర్, వన్ టౌన్, సత్యనారాయణపురం పోలీసు స్టేషన్ కి తరలించారు. అరెస్ట్ ఆయన వారిలో ఎస్ఎఫ్ఐ - డివైఎఫ్ఐ నాయకులు ఓ.యేసుబాబు - (ఎస్ఎఫ్ఐ విజయవాడ), కోటి - (ఎస్ఎఫ్ఐ, విజయవాడ ), ప్రసన్న కుమార్ - (ఎస్ఎఫ్ఐ, రాష్ట్రఅధ్యక్షుడు కేంద్రం), వెంకటేశ్వరరావు - (ఎస్ఎఫ్ఐ విజయవాడ), 5.లెనిన్ - (ఎస్ఎఫ్ఐ విజయవాడ), రవి - (ఎస్ఎఫ్ఐ విజయనగరం), హర్ష - ఎస్ఎఫ్ఐ విజయనగరం, హరీష్, చినబాబు, వెంకటేష్ , సతీష్, అరవింద్, రాము, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్, నెల్లూరు ఎస్.ఎఫ్. ఐ.కి చెందిన శ్రీనివాసులు, ఎస్.కె, సుల్తాన్ తదితరులు అరెస్ట్ అయ్యారు.