మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (09:21 IST)

తూర్పుగోదావరి జిల్లాలో వేడెక్కిన రాజకీయం

తూర్పుగోదావరి జిల్లాలో పంచాయతీ ఎన్నికల రాజకీయం వేడెక్కింది. జిల్లాలో మూడ్రోజుల నుంచి చలి బాగా పెరిగింది. అదే సమయంలో పంచాయతీ ఎన్నికలతో పల్లెల్లో రాజకీయ వేడి పెరిగింది.

అధికార వైసీపీ కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, రోడ్లు మొదలుకొని ఏవిధమైన అభి వృద్ధి చేపట్టకపోవడం ఒక కారణంకాగా, ప్రజల్లో అభద్రభావం మరో సమస్యగా మారి అధికార వైసీపీపై వ్యతిరేకతను పెంచేటట్టు చేస్తున్నాయి.

ప్రజలుకు ప్రభు  త్వం నుంచి మేలు జరిగినా జరగకపోయినా ప్రశాంత జీవితాన్ని కోరుకుంటారు.  ఇవాళ సోషల్‌ మీడియాను ఉపయోగించినా, ఓమాట మాట్లాడినా సమస్య అవుతోంది. ఏ ఏప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో, అతని ఎవరిని ఇబ్బంది పెడుతుందో అర్థంకాని భయం జనంలో పెరిగింది.

ఈనేపథ్యంలో ఇంచుమించు ప్రతిపక్షాలన్నీ ఏకమై, అధికార పక్షానికి చుక్కలు చూపించేటట్టు ఆలోచిస్తున్నాయి.  అధికార వైసీపీ మాత్రం ఏదోవిధంగా ఎక్కువ పంచాయతీలను కైవశం చేసుకుని, తానింకా బలీయంగానే ఉన్నానని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఏకగ్రీవాలు ఎక్కువ చేసుకోవాలనే ప్రయత్నం పెంచుతోంది.

కానీ ఎన్నికల కమిషన్‌ గట్టిగా ఉండడం వల్ల ప్రతిపక్షాలకు బలం పెరిగినట్టు అయింది.  ఏకగ్రీవాలు నామమాత్రంగానే అవుతున్నాయి. ఎక్కువ స్థానాల్లో హోరాహోరీ తలపడుతున్నాయి. ఇవాళ అందరి దృష్టి పంచాయతీల మీదే ఉంది. పంచాయతీలలో అధికార పార్టీకి ఎక్కువ స్థానా లు రాకుండా చేసి, 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు బలమైన పునాది వేసుకోవాలనే ఆలోచనతో ప్రతిపక్షాలు ఉన్నాయి.

అధికార వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కోఆర్డినేటర్లకు టార్గెట్లు ఉండడంతో  గ్రామాల్లో కూడా ఇంటింటికీ తిరిగేస్తున్నారు. అధికారం చూపి అనేక  ప్రలోభాలకు, భయాలకు గురి చేసే ప్రయత్నం కూడా చేశారు. అధికార యంత్రాంగాన్ని కూడా దుర్వినియోగం చేసే ఎత్తుగడలు కూడా నడిచాయి. అవి కొంతమేరకు మాత్రమే విజయవంతమయ్యాయి. మిగతా అన్నిచోట్ల హోరాహోరీ పోరు జరుగుతోంది. 

ప్రధాన పోటీ వైసీపీ, తెలుగుదేశం మధ్య ఉంది. జనసేన -బీజేపీ కలసి పోటీచేస్తున్నామని చెప్పినప్పటికీ, అది పెద్దగా రక్తికట్టినట్టు కనిపించడంలేదు. కానీ విచిత్రంగా తెలుగుదేశం-జనసేన అనేక చోట్ల  ఒప్పందాలు కుదుర్చుకుని ముందుకు పోతున్నాయి. ఈ పరిణామం  తెలుగుదేశం- జనసేనలకు చెందిన ఇరువర్గాల నేతలకు సంతృప్తినివ్వడంతోపాటు, భవిష్యత్‌పై ఆశలుకూడా  కలిగిస్తోంది.