సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 10 ఆగస్టు 2018 (14:13 IST)

మూలికా తైలాల మర్దన మాటున వ్యభిచారం.. ఎక్కడ?

హైదరాబాద్ నగరంలో మూలికా తైలాల మర్దన మాటున గుట్టుచప్పుడుకాకుండా వ్యభిచారం సాగుతోంది. అలసిసొలసిన శరీరానికి వివిధ రకాలైన మూలికలతో మసాజ్ చేసి నూతనోత్తేజాన్ని కల్పిస్తామంటూ ప్రచారం చేస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో మూలికా తైలాల మర్దన మాటున గుట్టుచప్పుడుకాకుండా వ్యభిచారం సాగుతోంది. అలసిసొలసిన శరీరానికి వివిధ రకాలైన మూలికలతో మసాజ్ చేసి నూతనోత్తేజాన్ని కల్పిస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ మసాజ్ కోసం ఆశపడి వచ్చే వారికి అందమైన అమ్మాయిలను చూపించి వ్యభిచారం చేసేలా ప్రోత్సహిస్తున్నారు. అలా అనేక కేంద్రాల్లో మర్దన మాటున అనైతిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
 
ఇందుకోసం అవసరమైన అమ్మాయిలను సరికొత్త విధానంలో ఎంపిక చేస్తుండటం గమనార్హం. స్పా, మసాజ్‌ కేంద్రాల్లో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలంటూ తొలుత ప్రకటనలు ఇస్తున్నారు. సౌందర్య పోషక శిక్షకుల ఉద్యోగాలంటూ యువతులను మాయ చేస్తున్నారు. అలా ఎంపికైన అమ్మాయిలతో వృత్తిలోభాగంగా పురుషులకు మర్దన చేసేలాని నిర్భంధిస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు రహస్యంగా ఆ దృశ్యాలను చిత్రీకరించి, అనంతరం వాటిని చూపించి వ్యభిచారానికి ఒప్పుకోకపోతే ఈ ఫొటోలు, వీడియోలు బంధువులు, సన్నిహితులకు పంపుతామంటూ బెదిరిస్తున్నారు. 
 
అలా యువతులను ఎంపిక చేసి తమ వ్యాపారాన్ని గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్నారు. ముఖ్యంగా, వ్యభిచారానికి ఒప్పుకుంటే ఒక జీతం.. అంగీకరించనివారి పట్ల మరోలా నడుచుకుంటున్నారు. స్పా, మసాజ్‌ కేంద్రాల నిర్వాహకుల వద్ద తమ వ్యక్తిగత రహస్యాలు ఉండటంతో బాధితులు మిన్నకుండిపోతున్నారు. ఈ అనైతిక కార్యకలాపాల్లో మసాజ్‌ కేంద్రాల యజమానులతో పాటు కొందరు మహిళలూ కీలక పాత్ర పోషిస్తున్నారు. 
 
ఇటీవల నారాయణగూడలోని గురుపుత్ర ఎస్టేట్‌లో స్ల్పాష్‌ బ్యూటీసెలూన్‌ పేరుతో రాధారెడ్డి అనే మహిళ సౌందర్య పోషక, మర్దన కేంద్రాన్ని నాలుగేళ్లుగా నిర్వహిస్తోంది. వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తోందంటూ పోలీసులకు సమాచారం అందడంతో ఆమెను అరెస్ట్‌ చేశారు. బెయిల్‌పై విడుదలై మళ్లీ అనైతిక కార్యకలాపాలకు తెరతీసింది. ఇలా రెండేళ్లలో ఆమెను పోలీసులు మూడుసార్లు అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు. 
 
అలాగే, జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నంబరు 10లో శ్రీ వీనస్‌ యూనిసెక్స్‌ సెలూన్‌ పేరుతో కొనసాగుతున్న స్పా కేంద్రంపై పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. స్పాలోని గదుల్లో ముగ్గురు యువకులకు యువతులతో మర్దన చేయిస్తున్నారు. అనంతరం ఆయా గదుల్లో సోదాలు నిర్వహించగా పదుల సంఖ్యలో కండోమ్‌లు కనిపించాయి.