సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (16:30 IST)

ఆయన కంటే నేనేం తక్కువకాదు... బాబు ఆదేశిస్తే పోటీ చేస్తా : బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్

రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్టు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. టీడీపీ సీనియర్ నేత, పారిశ్రామికవేత్త, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మనువడిగా ఈయనకు మంచి గుర్తింపు ఉంది. 
 
ఈ నేపథ్యంలో తన రాజకీయ ప్రవేశంపై మాట్లాడుతూ, తన తాతగారి ఆశయల మేరకు, ఆయన ఆశయాల సాధన కోసం తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించారు. పైగా, పార్టీ ఆదేశిస్తే విశాఖపట్టణం ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అలాగే, విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ తిరిగి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
కాగా, బాలకృష్ణ పెద్దల్లుడు, బ్రాహ్మణి భర్త అయిన నారా లోకేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటూనే ఏపీ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖామంత్రిగా కొనసాగుతున్నారు. దీంతో బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ కూడా ఇపుడు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు.