ఆదివారం, 5 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (17:53 IST)

#Bhismastami రోజున నూతన దంపతులు ఇలా చేస్తే?

మాఘమాసంలో ప్రాతఃకాలంలో చేసే స్నానాలకు మంచి ఫలితం వుంటుంది. మాఘమాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు. ఈ నెలలో ముల్లంగిని కొందరు తినరు. మాఘ మాసంలో నువ్వులను, పంచదార లేదా బెల్లంతో కలిపి తినాలట. నువ్వులను మాఘమాసంలో దానం చేసేవారికి పితృదోషాలు వుండవు. ఇంకా పితృదేవతలను సంతృప్తిపరిచిన వారవుతారని పండితులు చెప్తున్నారు. 
 
ఇంకా ఫిబ్రవరి 12న వచ్చే రథ సప్తమి రోజున సూర్యుడిని నమస్కరించాలి. కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృపి చెందుతాడట. ఈ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు అకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం. ఈ రోజున రథాన్ని ఎక్కి ప్రయాణాన్ని ప్రారంభించిన రోజు. ఈ రోజు నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది.
 
ఇకపోతే.. భీష్మాష్టమి.. ఫిబ్రవరి 13వ తేదీ (బుధవారం) వస్తోంది. 
 
"మాఘమానస్యచాష్టమ్యాం శుక్ల పక్షేచ పార్థివ!
ప్రాజాపత్యేచ నక్షత్రే మధ్య:ప్రాప్తే దివాకరే!" శోభకృత నామ సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి తిథినాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టినట్లు పురాణాలు చెప్తున్నాయి. 
 
అష్టమినాడే దైవ సాయుజ్యం పొందినా భీష్ముడు శ్రీ కృష్ణుని సమక్షంలోనే విష్ణుసహస్రనామాలతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందాడు. కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు. అందుకే భీష్మాష్టమి రోజున పితృదేవతలకు అర్ఘ్యమివ్వడం చేయాలి. 
 
పుణ్య నదుల్లో స్నానమాచరించాలి. పుణ్యనదుల్లో నువ్వులను వదలాలి. భీష్మ అష్టమి రోజున ఉపవాసం వుండే దంపతులకు సంతాన ప్రాప్తి చేకూరుతుంది. కొత్తగా పెళ్లైన వారు భీష్మ ఏకాదశిన ఉపవసించి.. విష్ణువును పూజిస్తే.. సంతాన ప్రాప్తి చేకూరుతుంది.