ఆదివారం, 9 నవంబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 6 నవంబరు 2025 (00:07 IST)

కార్తీక పౌర్ణమి నాడు కాశీ విశ్వనాథుని సన్నిధిలో గంగా నదిలో వెలుగుల దీపాలు

Dev Deepavali
కర్టెసి-ట్విట్టర్
కాశీ విశ్వనాథుడు. కార్తీక పౌర్ణమి కార్తీక దీపాలతో కాశీ విశ్వనాథుని సన్నిధిలో వున్న గంగా ప్రవాహం అంతా దీపపు వెలుగులతో ఓ వెలుగు ప్రవాహంలా మారిందా అన్నట్లు మారింది. కాశీ నగరం అంతా దీపాలతో కూడిన భక్తి సముద్రంలా మారిపోయింది. అక్కడ ప్రతి ఘాట్ వెలుగులో మునిగిపోతుంది. ఇక్కడ కాశీలో దేవ్ దీపావళి నిర్వహించారు. భక్తి విశ్వాసం మహిమాన్విత శక్తిలా కనిపిస్తుంది.
 
గంగలో వదిలిన నక్షత్ర దీపాలు ఆకాశంలోని నక్షత్రాలను ప్రతిబింబిస్తున్నాయా అన్నట్లున్నాయి. గంగా నది కాంతితో నిండిపోయింది. ప్రతి ఒక్క దివ్వె మాటున ఓ కోరిక, ఒక పేరు, దైవానికి తమ యొక్క భక్తిశ్రద్ధలను మోసుకెళ్తున్నాయి. కాశీ నగరం పసిడి వర్ణంతో మెరిసిపోతోంది. బాణసంచా వెలుగు స్వర్గంలోని కాంతినంతా దోచుకొస్తున్నాయా అన్నట్లుగా దేదీప్యమానంగా వెలిగిపోతోంది. దేవ్ దీపావళి అనేది కాశీ విశ్వనాథుడికి చేసే వేడుక మాత్రమే కాదు, భక్తులు శిరస్సు వంచి పారవశ్యంలో మునిగిపోయే మహాదేవునికి చేసే సేవ.