శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 25 జనవరి 2018 (13:40 IST)

సీఎం కుర్చీలో బాలయ్య కూర్చున్నారా? ఏం జరుగుతోంది?

ఈ వార్త ఇప్పుడు ఏపీలో కలకలం సృష్టిస్తోంది. సహజంగా ముఖ్యమంత్రి కుర్చీ అంటే ఆయన మాత్రమే కూర్చుంటారు. ఆయన విదేశాల్లో వున్నప్పుడు కానీ, లేదంటే పర్యటనల్లో వున్నప్పుడు కానీ ఆ కుర్చీలో కూర్చునే సాహసం ఎవ్వరూ చేయరు. కానీ ఎమ్మెల్యే, నటుడు, ముఖ్యమంత్రి చంద్రబాబ

ఈ వార్త ఇప్పుడు ఏపీలో కలకలం సృష్టిస్తోంది. సహజంగా ముఖ్యమంత్రి కుర్చీ అంటే ఆయన మాత్రమే కూర్చుంటారు. ఆయన విదేశాల్లో వున్నప్పుడు కానీ, లేదంటే పర్యటనల్లో వున్నప్పుడు కానీ ఆ కుర్చీలో కూర్చునే సాహసం ఎవ్వరూ చేయరు. కానీ ఎమ్మెల్యే, నటుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బావమరిది అయిన బాలయ్య ఏకంగా సీఎం సీటులో కూర్చున్నారంటూ ఓ వార్త హల్చల్ చేస్తోంది. 
 
బాలయ్య సీఎం సీటులో కూర్చున్నారంటూ ప్రతిపక్షం వారు హేళన చేయడమే కాకుండా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందరితో పాటు ఓ ఎమ్మెల్యేగా వున్న బాలయ్య సీఎంకు బంధువు కూడా కావడంతో సీఎం కుర్చీలో కూర్చున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. సీఎం సీటుకు ఏపీలో విలువ లేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఐతే బాలయ్య కూర్చున్నది సీఎం కుర్చీ కాదనీ, కేవలం సీఎం కూర్చునే ప్రాంతంలో మాత్రమే కూర్చున్నారంటూ అధికారులు సెలవిస్తున్నారు. మరి దీనిపై ఇంతటి రాద్దాంతం జరుగుతుందని బహుశా బాలయ్యకు కూడా తెలియదేమో?