శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2016 (11:39 IST)

తిరుపతిలో హైఅలర్ట్.. వేలూరులో ఉగ్రవాదుల జాడలే కారణం..!

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతిలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. చిత్తూరు జిల్లాకు సరిహద్దుప్రాంతమైన వేలూరులో ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయన్న కారణంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుపతికి వచ్చే భక్తులందరినీ

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతిలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. చిత్తూరు జిల్లాకు సరిహద్దుప్రాంతమైన వేలూరులో ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయన్న కారణంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుపతికి వచ్చే భక్తులందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే తిరుమలకు అనుమతిస్తున్నారు.
 
అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద కూడా వాహనాలను తనిఖీలు నిర్వహించిన తర్వాతనే తిరుమలకు అనుమతిస్తున్నారు. బుధవారం రాత్రి కూడా తిరుమలలోని పాపవినాశనం సమీపంలో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఇప్పటికే కోయంబత్తూరులో ఐదుమంది ఐసిస్‌ తీవ్రవాదులు పట్టుకోవడం, అందులో కొంతమంది వేలూరుకు వచ్చి సిఎంసి ఆసుపత్రిలో రోగుల ముసుగులో ఉన్నారని కేంద్రం నిఘా వర్గానికి సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వేలూరులో కొన్ని చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి బయటి రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేసి పంపుతున్నారు.