విశాఖ గ్యాస్ లీక్ ఘటనను సుమోటోగా తీసుకున్న హైకోర్టు
విశాఖపట్నంలోని ఆర్‌ఆర్ వెంకటాపురంలో ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి ప్రాణాంతక విషవాయువు లీకై ప్రమాదం చోటుచేసుకున్న ఘటనను హైకోర్టు సుమోటో కేసుగా తీసుకుంది.
ఈ ప్రమాదంపై ధర్మాసనం విచారణ చేపట్టింది. వచ్చే వారానికి వాయిదా వేసింది. ప్రమాద ఘటనపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.
అంతకుముందు ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ఏపీ ప్రభుత్వానికి జాతీయ మానవహక్కుల కమిషన్ నుంచి నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ నోటీసులు జారీ అయ్యాయి.
గ్యాస్ లీకేజీ ఘటన విషయమై సమాధానాలనివ్వాలని కమిషన్ తన నోటీసుల్లో ఆదేశించింది. కాగా ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీలం సాహ్ని పేరుతో ఈ నోటీసులు జారీ అయ్యాయి.