బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 20 మార్చి 2021 (13:12 IST)

బాలయ్య నియోజకవర్గంలో హిజ్రా దారుణ హత్య...

బాలయ్య నియోజకవర్గం హిందూపురంలో దారుణం చోటుచేసుకుంది. ఓ హిజ్రాను గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా గొంతుకోసి హతమార్చారు.
 
హిందూపురం సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో ఈ ఘటన జరిగింది. హిజ్రా గొంతు కోసి హత్య చేసిన తర్వాత మృతదేహంపై కిరోసిన్ పోసి తగులబెట్టారు.
 
స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.