శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 27 ఫిబ్రవరి 2021 (08:55 IST)

భర్త హత్య మాట వినగానే గుండెలు బాదుకున్న భార్య, చంపిందెవరో తెలుసుకుని పోలీసులు షాక్

తమిళనాడు తిరుచ్చి జిల్లాలో తురైయూర్ అటవీ ప్రాంతంలో 45 ఏళ్లున్న వ్యక్తి శవం వెలుగుచూసింది. అతడి పక్కనే బైకు నుజ్జునుజ్జయి పడి వుంది. ఎవరైనా దుండగులు చంపేశారా లేదంటే ప్రమాదంలో మరణించాడా అని పోలీసులు అనుమానపడ్డారు. సదరు వ్యక్తి భార్యకు ఫోన్ చేసి విషయం చెప్పారు. అంతే ఆమె గుండెలు బాదుకుంది. కేకలు, పెడబొబ్బలు పెట్టింది. కానీ అతడి హత్యలో వాస్తవం తెలుసుకుని పోలీసులు షాక్ తిన్నారు. ఏంటా నిజం?
 
తమిళనాడు తిరుచ్చి జిల్లా మెట్టూరు సైదాపేటలో పళనివేల్, మోహన దంపతులు. వీరికి 15 ఏళ్ల కుమారుడు, 8 ఏళ్ల కుమార్తె వున్నారు. మోహన ప్రభుత్వ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో ఐదెంకెల జీతం వస్తోంది. మరోవైపు భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ 15 ఎకరాలకు పైగా సొంత భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. చేతి నిండా లక్షల్లో డబ్బు. ఖర్చు పెట్టేవాళ్లకి ఖర్చుపెట్టినంత
 
ఐతే ఇటీవలి మోహన భర్తతో గొడవలు పడుతోంది. హఠాత్తుగా భర్తను వదిలేసి పిల్లల్ని తీసుకుని వేరుగా ఇల్లు తీసుకుంది. ఇదంతా తెలిసిన ఇరు కుటుంబాల పెద్దలు రాజీ కుదిర్చి మోహనను 3 నెలల పళినివేల్ వద్ద దిగబెట్టి వెళ్లారు. ఇదిలావుండగానే ఈ నెల 19న భర్త పళనివేల్ శవమై కనిపించాడు. తురైయూర్ అటవీ ప్రాంతంలో అతడి బైకు తుక్కుతుక్కుగా పడి వుంది.
 
భర్త చనిపోయాడన్న వార్త వినగానే గుండెలు బాదుకుంటూ పోలీసు కేసు పెట్టింది భార్య మోహన. తన భర్తను ఎవరో కావాలని హత్య చేయించారనీ, నిజాల్ని వెలికి తీయాలంటూ గావుకేకలు పెట్టింది. విచారణ జరిపించాలని గగ్గోలు పెట్టింది.
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులకు తొలుతు అంతుచిక్కలేదు. కానీ మోహన ఫోన్ తీగ లాగడంతో డొంక కదిలింది. పళనివేల్ స్నేహితుడు రాజాతో వున్న అక్రమ సంబంధమే కారణమని తేలింది. తన భర్త అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేయించి నాటకం ఆడిందని దర్యాప్తులో వెల్లడైంది. నిందితులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.