శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By కుమార్
Last Updated : బుధవారం, 17 ఏప్రియల్ 2019 (17:16 IST)

యాక్టింగ్ నేర్చుకోవడానికి వెళితే బట్టలిప్పమన్నారు...

సాధారణంగా క్షుద్రపూజలు సాధన చేసేవారు దిగంబరులుగా మారి సాధన చేయాలని వినే ఉంటారు. అయితే హైదరాబాద్‌లో నటన నేర్చుకోవడానికి కూడా బట్టలు విప్పమంటున్నారు కొందరు. నటన నేర్చుకోవడానికి ఒక సంస్థలో చేరిన యువతికి ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.


అచింత కౌర్ చద్దా అనే యువతి నటన నేర్చుకునేందుకు హిమాయత్ నగర్‌లో ఉన్న సూత్రధార్ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌కు వినయ్ వర్మ అనే వ్యక్తి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
దీని గురించి ఆమె మాట్లాడుతూ "ఈ మధ్యే నాతో పాటు మరో ఎనిమిది మంది విద్యార్థులు ఈ ఇనిస్టిట్యూట్‌లో నటన నేర్చుకోవడానికి చేరారు. మాకు ఉదయం 6:30 నుంచి 9:30 వరకు శిక్షణ తరగతులు ఉంటాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 16న వినయ్ వర్మ ఆధ్వర్యంలో యాక్టింగ్ తరగతులు నిర్వహించగా, అందులో తలుపులు, కిటికీలు అన్ని మూయమని చెప్పి ఆపై ఒక్కొక్కరిగా అందరినీ బట్టలు విప్పమని చెప్పారు. ఆ మాటలతో నేను షాక్‌కు గురయ్యాను. నేను బట్టలు తీయనని చెప్పాను. ఆయన నన్ను తిట్టి బయటికి వెళ్లిపొమ్మని చెప్పారు. కానీ ఒక యువతి ఆయన చెప్పినట్టుగానే బట్టలు విప్పింది. మిగతా యువకులు కూడా అలాగే చేశారు’’ అని చెప్పుకొచ్చింది. 
 
అక్కడి నుంచి బయటికి వచ్చిన యువతి ‘షీ టీమ్’కు ఫిర్యాదు చేయగా ఏసీపీ నర్మద, రామ్ లాల్ నుంచి తక్షణ స్పందన వచ్చినట్లు ఆ యువతి చెప్పింది. అయితే ఏసీపీ సూచన మేరకు నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో ఈ విషయమై ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు సరిగా స్పందించలేదని వాపోయింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి మద్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు వేచి ఉన్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.