సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 17 ఏప్రియల్ 2019 (09:11 IST)

రుషికొండ బీచ్‌లో రేవ్ పార్టీ.. అవి కూడా దొరుకుతాయట...

రుషికొండ బీచ్‌లో మాదకద్రవ్యాలతో జరిగిన రేవ్‌పార్టీపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఎండీఎంఏ, ఎల్ఎస్డీ మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో అరెస్టయిన సత్యనారాయణ అనే యువకుడి వద్ద జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. పార్టీలో పాల్గొన్న 15 మందిని విచారించిన పోలీసులు షాక్ తిన్నారు. 
 
మాదక ద్రవ్యాలను ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన మిథిలిన్ డీఆక్సీ మిథైన్ ఫిటామిన్ (ఎండీఎంఏ), లైసర్జిక్ యాసిడ్ డై ఇథలమైడ్ (ఎల్ఎస్‌డీ)లను రుషికొండలో జరిగిన రేవ్ పార్టీలో యువతకు గ్రాము నాలుగు వేల రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్టు తేలింది. 
 
ఈ మత్తు పదార్థాలు అరుదుగా లభిస్తాయని.. వాటిని విశాఖ యువత వినియోగించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోగు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.