శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 17 ఏప్రియల్ 2019 (10:24 IST)

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటీమణులు భార్గవి, అనుషా రెడ్డి మృతి

బుల్లితెర నటీమణులు భార్గవి, అనుషా రెడ్డి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఓ షూటింగ్ నిమిత్తం వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవులకు వెళ్లిన టీమ్, తిరుగుప్రయాణమై వస్తున్న వేళ ఎదురుగా వచ్చిన లారీని తప్పించబోయి.. టీవీ ఆర్టిస్టుల కారు చెట్టును ఢీకొంది.


ఈ ఘటనలో టీవీ ఆర్టిస్టులు అనుషా రెడ్డి, భార్గవి తీవ్రగాయాలతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదం చేవెళ్ల సమీపంలోని అప్పారెడ్డి గూడ బస్టాప్ వద్ద జరిగింది.
 
ఓ సీరియల్ కోసం వీరు షూటింగ్ ముగించుకుని హైదరాబాద్‌కు వస్తుండగా ప్రమాదం జరిగింది. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా, నిర్మల్‌‌కు చెందిన భార్గవి (20), భూపాలపల్లి జయశంకర్‌ జిల్లాకు చెందిన అనుషారెడ్డి (21) మరణించారు. కారు డ్రైవర్‌ చక్రి, వీరితో పాటు ప్రయాణిస్తున్న వినయ్‌ కుమార్‌ లకు తీవ్ర గాయాలు కాగా, వీరిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు