శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 8 సెప్టెంబరు 2021 (07:54 IST)

సొంత స్థలం కలిగిన పేదలకు జగనన్న ఇళ్లు

పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా సొంత స్థలం కలిగి ఇళ్లు నిర్మించుకోవాలనుకునే పేదలకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ఇళ్లను మంజూరు చేస్తోంది.

తెల్ల రేషన్ కార్డు కలిగి పక్కా ఇళ్లు లేని పేదలను ఈ పథకానికి అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమైనది. కావున లబ్ధిదారులు తగిన డాక్యుమెంట్లను ఎమ్మెల్యే కార్యాలయంలో లేదా హౌసింగ్ కార్యాలయంలో అందజేయవలసిందిగా తెలియజేయడమైనది. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవలసిందిగా కోరుతున్నాము. 
 
లబ్ధిదారుడు అందజేయవలసిన డాక్యుమెంట్ల వివరాలు :
1. తెల్ల రేషన్ కార్డు/ బియ్యం కార్డు నకలు 
2. ఆధార్ కార్డు  (భార్యభర్తలిరువురివి) నకలు 
3. స్థలం పట్టా/ దస్తావేజు నకలు
4. బ్యాంకు అకౌంట్ పాసు పుస్తకం నకలు
5. ఓటరు కార్డు నకలు