శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2016 (10:48 IST)

ఏలూరు ఆశ్రమ ఆసుపత్రిలో హౌస్ సర్జన్ ఆత్మహత్య.. మూడో అంతస్తు నుంచి దూకి...

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రమ ఆసుపత్రిలో ఓ హౌస్ సర్జన్ ఆత్మహత్య చేసుకున్నాడు. మూడో అంతస్తు నుంచి కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... కాకినాడకు చెందిన వెంకటరాజు కుమారుడ

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రమ ఆసుపత్రిలో ఓ హౌస్ సర్జన్ ఆత్మహత్య చేసుకున్నాడు. మూడో అంతస్తు నుంచి కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... కాకినాడకు చెందిన వెంకటరాజు కుమారుడి రితేష్. 
 
హౌస్‌సర్జన్‌గా పని చేస్తున్న రితేష్.. హాస్టల్‌లోని మూడో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విగత జీవిగా పడివున్న రితేష్‌ను సహవిద్యార్థులు గుర్తించి హాస్టల్ యాజమాన్యానికి సమాచారం అందించగా, వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి, ఏలూరు ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. రితేష్ బలవన్మరణానికి పాల్పడడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.