మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2020 (12:49 IST)

పెను ప్రమాదం నుంచి బయటపడిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా ఉన్న బండారు దత్తాత్రేయ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తుండగా దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. 
 
ఈ ఘటన చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ శివారులో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. స్టీరింగ్ బిగుసుకు పోవడంతో రోడ్డు పక్కకు కారు దూసుకుపోయింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
 
ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికి మరో వాహనంలో గవర్నర్ దత్తాత్రేయ సూర్యాపేటకు బయల్దేరి వెళ్లారు. సూర్యాపేటలోని గుండగోని మైసయ్య కన్వెన్షన్ హాల్‌లో గవర్నర్ దత్తాత్రేయకు పౌర సన్మానం జరుగనుంది. 
 
ఈ ప్రయాణానికి ముందు గవర్నర్ దత్తాత్రేయతో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్.. ఆయన నివాసంలో భేటీ అయ్యారు. దత్తాత్రేయను మర్యాదపూర్వకంగా కలిసినట్లు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తెలిపారు.