శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 7 మే 2017 (10:03 IST)

ముగ్గురు భార్యలు.. మొదటి భార్యపై మోజు తీరింది... బ్లేడ్‌తో దాడిచేసి భర్త పరారీ

హైదరాబాద్‌లో ముగ్గురు భార్యల ముద్దుల భర్త కటకటాలపాలయ్యాడు. ముగ్గురు భార్యల్లో మొదటి భార్యపై మోజు తీరడంతో ఆమెను అంతమొదించాలని ప్లాన్ చేసిన భర్త చివరకు ఆమెపై దాడి చేసి పరారైన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి

హైదరాబాద్‌లో ముగ్గురు భార్యల ముద్దుల భర్త కటకటాలపాలయ్యాడు. ముగ్గురు భార్యల్లో మొదటి భార్యపై మోజు తీరడంతో ఆమెను అంతమొదించాలని ప్లాన్ చేసిన భర్త చివరకు ఆమెపై దాడి చేసి పరారైన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్, హఫీజ్‌బాబానగర్‌ ఎ-బ్లాక్‌లో పర్విన్‌బేగం (23) నివసిస్తోంది. ఆమె భర్త లతీఫ్‌ అలియాస్‌ అజీమ్‌(30) శుక్రవారం రాత్రి 10 గంటలకు ఇంటికొచ్చి భార్యతో ఘర్షణ పడ్డాడు. నాలుగు రోజులకొకసారి ఇంటికెళుతున్న అతడు ఆమెను చంపాలనుకున్నాడు. బ్లేడ్‌తో ఫర్వీన్‌బేగం గొంతు కోశాడు. అడ్డొచ్చిన కుటుంబ సభ్యులపై దాడిచేసి పారిపోయాడు. గాయపడిన ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 
 
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ విచారణలో లతీఫ్‌కు ముగ్గురు భార్యలు ఉన్నట్టు తేలింది. రెండోభార్య దుబాయ్‌లో, మూడోభార్య సభా రియాసతనగర్‌లో నివసిస్తున్నారు. అందులో పర్విన్ బేగం మొదటి భార్య. ఈమెపై మోజు తీరడంతో ఆమెను హత్య చేయాలని భావించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఫర్వీన్‌బేగానికి ఇద్దరు కుమారులు.