శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 జూన్ 2017 (13:53 IST)

బెదిరించేందుకు శరీరంపై కిరోసిన్ పోసుకున్న భార్య.. అగ్గిపుల్ల గీసి నిప్పంటించిన భర్త.. ఎక్కడ?

ఆ దంపతులిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అదీ కూడా రైలులో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి చివరకు పెళ్లిపీటలపై కూర్చొన్నారు.కానీ అనుమానం పెనుభూతమైంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్

ఆ దంపతులిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అదీ కూడా రైలులో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి చివరకు పెళ్లిపీటలపై కూర్చొన్నారు.కానీ అనుమానం పెనుభూతమైంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే తనను అనుమానించడంతో ఆ మహిళ తట్టుకోలేక పోయింది. దీంతో భర్తను బెదిరించే నిమిత్తం శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కానీ, పాషాణ హృదయుడైన భర్త.. ఏకంగా అగ్గిపుల్ల గీసి నిప్పంటించాడు. గుంటూరు జిల్లా తుళ్లూరు వద్ద చోటుచేసుకున్న ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
ఒంగోలు జిల్లా ఊపూరుపాలెం దగ్గర గల తోటవారిపాలెంకు చెందిన బీఎస్సీ నర్సింగ్‌ చదువుతున్న బాపట్ల ప్రశాంతి కుమారి (25)కి బేల్దార్‌ పని చేసే సింగరాయకొండకు చెందిన బాపట్ల అశోక్‌ కుమార్‌కు రైలులో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి నాలుగేళ్ల కిందట వివాహం చేసుకున్నారు.
 
వీరిద్దరు ఉపాధి నిమిత్తం రాజధాని ప్రాంతం తుళ్ళూరుకు రెండేళ్ల క్రితం వచ్చారు. వెంకటపాలెంలో కాపురం ఉంటూ అశోక్‌బాబు బేల్దారి పనులకు వెళుతుండగా ప్రశాంతి ఇంటి వద్దే ఉంటోంది. వీరికి రెండున్నర ఏళ్ల కుమారుడు ఉన్నాడు. శనివారం సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తకు భార్యపై అనుమానం కలిగింది. ఇది తెలిసిన ప్రశాంతి నన్నే అనుమానిస్తావా? అంటూ శరీరంపై కిరోసిన్‌ పోసుకుంది.
 
అప్పటికే భార్యపై ఆగ్రహంతో ఉన్న భర్త.. అగ్గిపుల్ల గీసి ఆమెపై వేశాడు. దీంతో శరీరమంతా మంటలు వ్యాపించడంతో ఆమె బాగా కాలిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తన భర్తే అగ్గిపుల్ల గీసి నిప్పంటించాడని పేర్కొంది. శరీరం మూడొంతులు కాలిపోవటంతో చికిత్స పొందుతూ విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం ఆమె మృతి చెందింది. హత్య కేసుగా నమోదు చేసి తుళ్లూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.