బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 మార్చి 2021 (14:17 IST)

భార్య మద్యం సేవించడం నచ్చలేదు.. విసిగిపోయిన భర్త ఏం చేశాడంటే?

భార్య మద్యం సేవించడం నచ్చని భర్త విసిగిపోయిన భర్త.. క్షణికావేశంలో భర్త భార్యను హతమార్చిన ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. ఎన్నిసార్లు అభ్యంతరం చెప్పినా.. భార్య మద్యం సేవించడాన్ని ఆపలేదు. దీంతో భార్యాభర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. అంతే భర్తను భార్యను ఆవేశంలో హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లాలోని అరకు మండలం పూజారిపట్టు గ్రామానికి చెందిన మర్రి శోభన్(30) భార్యమర్రి తులసి(24) ఏడాది కాలంగా మాతుమూరు లోని ఓ రైతుకు చెందిన పామాయిల్ తోటలో పనిచేస్తూ జీవిస్తున్నారు.
 
మార్చి27 శనివారం తులసి తన తల్లితో కలిసి సాలూరు వెళ్లింది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మద్యం సేవించి వచ్చింది. ఈ విషయమై భార్యా భర్తలమధ్య ఘర్షణ జరిగింది. మాటామాటా పెరిగింది. భార్యా భర్తలిద్దరూ గొడపడుతూనే…. తాము పనిచేస్తున్న జామాయిల్ తోటలోకి వెళ్ళారు.
 
అప్పటికి కోపం పెరిగిపోయిన భర్త అక్కడున్న కర్ర తీసుకుని భార్య మొహంపై గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు తీవ్ర గాయం అయిన తులసి అక్కడికక్కడే మరణించింది. సమాచారం తెలుసుకున్న సాలూరు సీఐ ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.