రౌడీ షీటర్ వేధింపులు .... బ్యూటీషియన్ ఆత్మహత్య

satya sirisha
Last Updated: మంగళవారం, 23 జులై 2019 (17:43 IST)
హైదరాబాద్ నగరంలోని కేబీహెచ్‌పీలో ఓ బ్యూటీషియన్ చేసుకుంది. స్థానిక రౌడీ ఒకరు వేధింపులకు గురిచేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. మృతురాలి పేరు సత్యశిరీష్. తన ఇంట్లోనే ఫ్యానుకు ఉరివేసుకుంది.

తన భర్త బయటకు వెళ్లిన సమయంలో ఆమె ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, పశ్చిమగోదావరి జిల్లాలోని దొమ్మేరు ఆమె స్వగ్రామం.

దీనిపై ఆమె భర్త గోపాలకృష్ణ స్పందించారు. తన భార్య మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు. తన భార్య శిరీషను కొన్ని రోజులుగా స్థానిక రౌడీ షీటర్ వేధిస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనలో వాస్తవాలు బయటకు తీయాలని తన ఫిర్యాదులో కోరారు.దీనిపై మరింత చదవండి :