సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 అక్టోబరు 2019 (22:21 IST)

మహిళను కిడ్నాప్ చేసి ఆపై గ్యాంగ్ రేప్

హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో శుక్రవారం ఓ దారుణం జరిగింది. కొందరు కామాంధులు ఓ మహిళను కిడ్నాప్ చేసి ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అయితే, ఆ మహిళ ఆ కామాంధుల చెర నుంచి చాకచక్యంగా తప్పించుకుని రోడ్డుపైకి వచ్చి పెద్దగా కేకలు వేసింది. దీంతో ఇరుగుపొరుగు వచ్చి ఆమెను రక్షించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, నార్సింగి ప్రాంతంలోని పుప్పాల్ గూడకు చెందిన ఓ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్నది. ఆ సమయంలో కొందరు దుండగులు ఆమెను కిడ్నాప్ చేసి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిత అత్యాచారానికి పాల్పడ్డారు. నోట్లో గుడ్డలు కుక్కి చిత్రహింసలకు గురిచేశారు.
 
 కామంధుల చెర నుంచి తప్పించుకున్న ఆ మహిళ రోడ్డుపైకి వచ్చి కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. పారిపోతున్న ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నించగా... ఇద్దరు తప్పించుకున్నారు. పట్టుబడిన మూడో వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.