బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 31 జులై 2018 (17:09 IST)

నపుంసకుడిగా ముద్రవేసిన భార్య.. అత్తమామలకు అశ్లీల వీడియోను పంపిన అల్లుడు...

తన భర్త నపుంసకుడు అంటూ కట్టుకున్న భార్య దుష్ప్రచారం చేసింది. అంతటితో ఆగని ఆమె.. భర్త నుంచి దూరమయ్యేందుకు విడాకులు కోరింది. కట్టుకున్న భార్య చేసిన పనికి తగిన గుణపాఠం చెప్పాలని ఆ భర్త ఓ నిర్ణయానికి వచ్చ

తన భర్త నపుంసకుడు అంటూ కట్టుకున్న భార్య దుష్ప్రచారం చేసింది. అంతటితో ఆగని ఆమె.. భర్త నుంచి దూరమయ్యేందుకు విడాకులు కోరింది. కట్టుకున్న భార్య చేసిన పనికి తగిన గుణపాఠం చెప్పాలని ఆ భర్త ఓ నిర్ణయానికి వచ్చాడు. అనుకున్నదే తడవుగా మరో మహిళతో కలిసి వున్నపుడు తీసిన అశ్లీల వీడియోను అత్తమామలకు పంపించారు. హైదరాబాద్‌లోని లాల్‌ బహదూర్‌ నగర్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
లాల్‌ బహదూర్‌ నగర్‌కు చెందిన విభావసుకు, తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగర శివారు ప్రాంతమైన కొడుంగయూరు, ముత్తమిళ్ నగర్‌కు చెందిన అనూష అనే యువతికి రెండేళ్ళ కిందట వివాహం జరిగింది. అయితే పెళ్లైన 15 రోజులకే అనూష తిరిగి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లిపోయారు.
 
ఇరు కుటుంబాల వారు భార్య, భర్తలను కలపడానికి కౌన్సెలింగ్‌లు కూడా ఇప్పించారు. ఈ క్రమంలోనే తన భర్త నపుంసకుడని తనకు విడాకులు మంజూరు చేయాలని కోరుతూ అనూష చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. 
 
దీంతో భార్యకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్న విభావసు... మహిళతో శృంగారంలో పాల్గొన్న వీడియోను తీసి అనూష కుటుంబ సభ్యులకు పంపాడు. ఈ వీడియోను చూసిన అత్తమామలు షాక్‌కు గురయ్యారు. దీంతో అనూష.. పోర్న్‌ వీడియోను తన కుటుంబసభ్యులకు పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భర్తపై కేసు పెట్టింది. ఫలితంగా విభావసును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.