శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 30 జులై 2018 (16:14 IST)

భార్యకు మత్తు ఇచ్చి అసహజ శృంగారం... వీడియో తీసి నెట్‌లో పెడతానన్న భర్త.. ఎందుకు?

అగ్నిసాక్షిగా పెళ్ళి చేసుకున్నాడు. పెళ్లైన రెండో రోజు నుంచే భార్యకు నరకం చూపించడం మొదలుపెట్టాడు. అసహజ లైంగిక కోర్కెలు తీర్చాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. సిగరెట్లతో ఒళ్లంతా కాల్చేవాడు. అంతేకాదు బ్లేడ్లతో శరీరంపై కోసేవాడు. ఇలా పెళ్ళయిన భార్యకు నరకం చూప

అగ్నిసాక్షిగా పెళ్ళి చేసుకున్నాడు. పెళ్లైన రెండో రోజు నుంచే భార్యకు నరకం చూపించడం మొదలుపెట్టాడు. అసహజ లైంగిక కోర్కెలు తీర్చాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. సిగరెట్లతో ఒళ్లంతా కాల్చేవాడు. అంతేకాదు బ్లేడ్లతో శరీరంపై కోసేవాడు. ఇలా పెళ్ళయిన భార్యకు నరకం చూపించాడో భర్త. తెలంగాణా రాష్ట్రంలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
 
వరంగల్ జిల్లా రంగసాయిపేటకు చెందిన శ్రీనివాస్, అదే ప్రాంతానికి చెందిన రమేష్‌, విజయల కుమార్తె రమ్యలను ఇచ్చి నెలక్రితం వివాహం చేశారు. ఉన్న ఒక్కగానొక్క కుమార్తెకు అప్పు చేసి మరీ తండ్రి వివాహం చేశాడు. అయితే ఆ ఆశ కాస్త నెలరోజుల్లోనే ఆవిరైపోయింది. అందుకు ప్రధాన కారణం శాడిస్ట్ భర్త శ్రీనివాస్ చేష్టలే. పెళ్ళయిన రెండవరోజు రాత్రి నుంచి శారీరకంగా భార్యను హింసించడం మొదలెట్టాడు. అసహజంగా శృంగారం చేయాలంటూ ఒత్తిడి తెచ్చాడు. శృంగారం చేసే సమయంలో వీడియోలు, ఫోటోలు తీసేందుకు ప్రయత్నించేవాడు.
 
భర్త చేష్టలను వారంపాటు భరిస్తూ వచ్చింది. అయితే భార్య ఎంతకూ తన మాట వినకపోవడంతో కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి భార్యతో శారీరకంగా కలిసిన వీడియోలు, ఫోటోలు తీశాడు శ్రీనివాస్. ప్రతిరోజు తాను చెప్పినట్లే చేయాలని, అసహజంగా శృంగారం చేయాలని ఒత్తిడి తెచ్చాడు. అలా చేయకుంటే ఆ వీడియోలను ఇంటర్నెట్‌లో పెట్టేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు తల్లిదండ్రులకు విషయం తెలిపింది. తమ కుమార్తెను వెంట పెట్టుకుని వరంగల్ పోలీసులకు శ్రీనివాస్ పైన ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. శ్రీనివాస్ ఉపయోగిస్తున్న కంప్యూటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.