బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 8 జులై 2017 (09:26 IST)

న్యాయవాది కాదు రేపిస్టు.. భార్య ఇంట్లో లేకపోవడంతో పనిమనిషిపై అత్యాచారం

వయసు 60 యేళ్లు. వృత్తి న్యాయవాది. కానీ, కామం కళ్లు కప్పేసింది. ఫలితంగా పలువురి ఇళ్ళలో పాచిపని చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందుకోసం సెక్యూరిటీగార్డు సహకారం కూడా తీర్చుక

వయసు 60 యేళ్లు. వృత్తి న్యాయవాది. కానీ, కామం కళ్లు కప్పేసింది. ఫలితంగా పలువురి ఇళ్ళలో పాచిపని చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందుకోసం సెక్యూరిటీగార్డు సహకారం కూడా తీర్చుకున్నాడు. పైగా, తాను పని ముగించిన తర్వాత సెక్యూరిటీగార్డుతో కూడా అత్యాచారం చేయించాడు. హైదరాబాద్ నగరం, న్యూ నాగోల్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
న్యూ నాగోల్‌లో నివసించే ప్రకాశ్‌ (60) వృత్తిరీత్యా న్యాయవాది. అతడి కుటుంబ సభ్యులందరూ కొద్దిరోజుల క్రితం కొంపల్లికి వెళ్లడంతో ప్రకాశ్‌ ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు. తన ఇంట్లో పనిచేసేందుకు మనిషి కావాలని తనకు తెలిసిన సెక్యూరిటీ గార్డు కృష్ణ(35)కు చెప్పాడు. కృష్ణ తనకు తెలిసిన మరో సెక్యూరిటీ గార్డు ద్వారా యూసు్‌ఫగూడకు చెందిన మహిళ(43)ను జూన్‌ 29న ప్రకాశ్‌ ఇంటికి పిలిపించాడు. 
 
అయితే, ఆమెకు ఆహారంలో వారు మత్తు మందు కలిపి ఇచ్చారు. కొద్దిసేపటికి సృహకోల్పోవడంతో ఇద్దరు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను రాత్రి యూసు్‌ఫగూడలో దింపివచ్చారు. వారం తర్వాత జరిగిన దారుణాన్ని బంధువుల దృష్టికి తీసుకెళ్లింది. వారి సూచన మేరకు ఆమె.. చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు జరుపుతున్నారు.