హెర్నియా ఆపరేషన్ చేశాక కత్తెరను కడుపులో పెట్టి కుట్లు వేసిన వైద్యులు
ఓ మహిళకు హెర్నియా ఆపరేషన్ చేసిన వైద్యులు... కడుపులో కత్తెరను పెట్టి కుట్లు వేశారు. కొద్ది రోజుల తర్వాత ఆ మహిళకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికెళ్లి తనిఖీ చేయగా, కడుపులో కత్తెర ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
హైదరాబాద్, మంగళ్‌హాట్‌కు చెందిన మహేశ్వరి (33) అనే మహిళకు మూడునెలల క్రితం హెర్నియా ఆపరేషన్ జరిగింది. దవాఖానా నుంచి డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిన తర్వాత కడుపునొప్పి రావడంతో కంగారుపడి మరోసారి నిమ్స్ వైద్యులను సంప్రదించింది.
వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు మహేశ్వరి పొట్టలో కత్తెర ఉన్నట్టు గుర్తించారు. మరోసారి ఆపరేషన్ చేసి కడుపులో నుంచి కత్తెరను వెలికితీశారు. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. ఈ ఘటనపై ముగ్గురు సభ్యులతో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొంటామని తెలిపారు.