మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 9 ఫిబ్రవరి 2019 (11:02 IST)

హైదరాబాద్ మెట్రో స్టేషన్.. రూ.50కే అన్ లిమిటెడ్ టిఫిన్

హైదరాబాద్‌ మెట్రో స్టేషన్లు ప్రస్తుతం వార్తల్లో బాగానే నిలుస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్‌లో ప్రారంభమైన అయ్యంగార్ ఇడ్లీ దోశ క్యాంటీన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.50 చెల్లిస్తే ఇష్టం వచ్చినట్లు ఇడ్లీలు, దోసెలు, పొంగల్‌ను టిఫిన్‌గా తీసుకోవచ్చు.
 
అలాగే రూ.100 రూపాయలు చెల్లిస్తే.. అన్ లిమిటెడ్ భోజనం చేయవచ్చునని తెలిపింది. ఈ క్యాంటీన్‌ను మెట్రో రైలు అధికారి అనిల్ కుమార్‌ షైని ఆరంభించారు. మెట్రో క్యాంటీన్‌లో భోజనం చేసేందుకు ప్రజలు ఎగబడ్డారు.