సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : గురువారం, 7 ఫిబ్రవరి 2019 (17:10 IST)

ప్రియుడు - ప్రియుడు స్నేహితులతో కలిసిన భర్తను చంపేసిన భార్య

అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న హత్యలు పెరిగిపోతున్నాయి. ఒక మహిళ తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించి అంత్యక్రియలు కూడా జరిపించింది. కానీ నిజం ఆలస్యంగా బయటపడింది. వివరాల్లోకి వెళితే బాబాఖాన్ అనే వ్యక్తి హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో భార్య జహీదాతో కలిసి నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా అతని భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారి బంధానికి భర్త అడ్డువస్తుండటంతో అతడిని హతమార్చాలని పన్నాగం పన్నింది. బాబాఖాన్ తన ఇంట్లో ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో ప్రియుడు మరియు అతని స్నేహితులను పిలిపించి గొంతు నులిమి దారుణంగా హత్య చేయించింది. 
 
చట్టానికి చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకోవాలని ప్రయత్నించింది. ఏమీ ఎరగనట్లు అంత్యక్రియలు కూడా జరిపించింది. మృతుని మరణం పట్ల మరియు ఆమె ప్రవర్తన పట్ల అనుమానం రావడంతో, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శవాన్ని తిరిగి వెలికితీసి పోస్ట్‌మార్టం నిర్వహించగా గొంతు నులిమి చంపినట్లు తేలింది. 
 
పోలీసులు కేసు నమోదు చేసుకుని జహీదాను విచారించారు. దాంతో ఆమె అసలు విషయం బయటపెట్టింది. వివాహేతర బంధానికి అడ్డువస్తున్నాడనే ప్రియుడు అతని స్నేహితునితో కలిసి ఒంటి గంట సమయంలో హత్య చేయించానని వెల్లడించింది. ఈ దారుణానికి పాల్పడిన నిందితురాలిని, ఆమె ప్రియుడిని వారితోపాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.