శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 4 జులై 2017 (06:49 IST)

అతనితో భార్య సన్నిహితంగా ఉంటుందనీ... భర్త సూసైడ్

హైదరాబాద్ నగరంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేక పోయాడు. దీంతో తన ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన

హైదరాబాద్ నగరంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేక పోయాడు. దీంతో తన ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన గోపాల్‌కు ఓ యువతితో పదేళ్ళ క్రితం వివాహమైంది. తన భార్య గ్రామంలో ఉండే మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటం చూసి గోపాల్ తట్టుకోలేకపోయాడు. మిగతా కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌కు వచ్చేశాడు. 
 
సంతోష్ నగర్‌లోని న్యూ రక్షాపురం కాలనీలో ఉంటూ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, భార్యను ప్రవర్తపై పలుమార్లు హెచ్చరించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. దీంతో తన జీవితం నాశనమైపోయిందని మనస్తాపానికి గురైన గోపాల్.. ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరికి 9 సంవత్సరాల బాలుడు కూడా ఉన్నాడు. దీనిపై సంతోష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.