శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (14:09 IST)

పడక గదిలో ప్రియుడితో నగ్నంగా కనిపించిన భార్య... భర్తను దిండుతో ఊపిరాడకుండా చేసి చంపిన వైనం...

ఓ మహిళ కట్టుకున్న భర్త కంటే మాయమాటలు చెప్పి తన సుఖం తీర్చుకుంటూ వచ్చిన ప్రియుడే గొప్ప అని భావించింది. ఇందుకోసం అతనితో కలిసి భర్తను కడతేర్చింది. ఆ తర్వాత చేసిన హత్యను సహజ మరణమని నమ్మించేందుకు శతవిధాలా

ఓ మహిళ కట్టుకున్న భర్త కంటే మాయమాటలు చెప్పి తన సుఖం తీర్చుకుంటూ వచ్చిన ప్రియుడే గొప్ప అని భావించింది. ఇందుకోసం అతనితో కలిసి భర్తను కడతేర్చింది. ఆ తర్వాత చేసిన హత్యను సహజ మరణమని నమ్మించేందుకు శతవిధాలా ప్రయత్నించి పోలీసులకు చిక్కింది. హైదరాబాద్, బాలానగర్‌ ఏరియాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్, నెహ్రూ నగర్‌కు చెందిన రమేష్‌ (38) అనే వ్యక్తి ఎల్ఐసి ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు భార్య దేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇదే ప్రాంతంలో ఉంటున్న ఎంటీఏఆర్‌ కంపెనీలో మెషిన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న అమరేందర్‌ (36)తో దేవికి పరిచయం ఏర్పడింది. ఇది వారిమధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. చనువు ఎక్కువ కావడంతో రమేష్ లేని సమయంలో దేవి ఇంటికి అమరేందర్ వచ్చి వెళ్లేవాడు. ఈ విషయం తెలుసుకున్న రమేష్‌.. భార్యతో గొడవపడి మరో ప్రాంతానికి నివాసం మార్చాడు. 
 
అయినా అమరేందర్‌‌ను దేవి ఇంటికి పిలిపించుకుని తన శారీరకసుఖం తీర్చుకుంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో గత నెల 20వ తేదీన సాయంత్రం రమేష్‌ ఇంటికొచ్చేసరికి అమరేందర్‌తో దేవి పడక గదిలో నగ్నంగా ఉండడాన్ని గమనించి ఘర్షణపడ్డాడు. దీంతో విషయం బయటకు పొక్కకుండా తన ప్రియుడితో కలిసి దేవి.. భర్త రమేష్‌ ముఖంపై తలగడ పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. అర్థరాత్రి సమయంలో చుట్టుపక్కల వారిని నిద్రలేపి భర్త కదలడంలేదని ఏడుస్తూ ఆమె చెప్పడంతో 108కి ఫోన్‌ చేయగా వారు వచ్చి మృతి చెందినట్లు ధృవీకరించారు. 
 
గుండెపోటుతో మరణించి ఉంటాడని చుట్టు పక్కలవారిని నమ్మించింది. మరుసటి రోజు చింతల్‌లో ఉండే మృతుడి తల్లి కృష్ణకుమారి కోడలిపై అనుమానం ఉందని అక్రమ సంబంధం కొనసాగిస్తోందని, దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఆ నివేదిక ఆధారంగా విచారించగా దేవి, అమరేందర్‌ నేరం అంగీకరించారు. సోమవారం వారిని అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు.