శనివారం, 8 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 8 ఫిబ్రవరి 2025 (18:45 IST)

కిరణ్ రాయల్ చేసిన మోసంతో చనిపోతున్నా: సెల్ఫీ వీడియోలో మహిళ సంచలన ఆరోపణ

Victim Lakshmi
తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ పైన లక్ష్మి అనే మహిళ తీవ్ర ఆరోపణలు చేసారు. సెల్ఫీ వీడియోలో ఆమె మాట్లాడుతూ... లైఫ్‌లో ఒకర్ని నమ్మి మోసపోయా. నేను అతనికి కోటి 20 లక్షలిచ్చాను అప్పులు చేసి. నా పిల్లల్ని చంపుతానని బెదిరించి నా దగ్గర బాండ్లు రాయించుకున్నాడు. నన్ను బెదిరించిన వీడియో ప్రూఫ్స్ నా దగ్గర వున్నాయి.
 
ఇంక నేను బతకలేను. అప్పులు ఎక్కువైపోయాయి. పిల్లలకు సమాధానం చెప్పకలేకపోతున్నాను. అతనెవరంటే తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్. కేవలం కిరణ్ రాయల్ కారణంగానే నేను చనిపోతున్నా. నేను చనిపోయాకైనా ఆ డబ్బులు నా పిల్లలికి ఇస్తారని ఆశిస్తున్నా'' అంటూ ఆమె సెల్ఫీ వీడియోలో ఆరోపణలు చేసారు.