శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 డిశెంబరు 2021 (12:49 IST)

హీరో నాని భజనపరుడు.. మంత్రి అనిల్ ఫైర్

నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యలపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. టిక్కెట్ రేటు తగ్గితే రెమ్యూనరేషన్ తగ్గుతుందని వారి బాధ అని తెలిపారు. భీమ్లానాయక్, వకీల్ సాబ్‌కి పెట్టిన ఖర్చు ఎంత అని నిలదీశారు.
 
పవన్ కల్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత అన్నారు. తన క్రేజ్‌ని పవన్ కల్యాణ్ అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రొడక్షన్ కాస్ట్ 20శాతం అయితే , రెమ్యునరేషన్ 80శాతం ఉందన్నారు మంత్రి. 
 
హీరో నాని భజనపరుడు అని మంత్రి అనిల్ అన్నారు. "అసలు నాకు హీరో నాని ఎవరో తెలియదని.. నాకు తెలిసింది కొడాలి నాని మాత్రమే" అని చురకలు అంటించారు. 
 
పవన్ కల్యాణ్ మోజులో పడి తాను కూడా చాలా తగలేసానని ఫైర్ అయ్యారు. అమ్మానాన్నలు కష్టపడి సంపాదించిన డబ్బును కొందరు యువకులు క్రేజ్ కోసం సినిమాలకు ఖర్చు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి.