శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2020 (21:20 IST)

గుంటూరు జిల్లాలో అక్రమ మద్యం పట్టివేత

ఆంధ్రప్రదేశ్‌లో ధరలు భారీగా పెరగడంతో తెలంగాణ నుంచి మద్యం అక్రమ రవాణా పెరిగిపోతోంది. సరిహద్దు జిల్లాల నుంచి లక్షల రూపాయల మద్యం నిత్యం అక్రమంగా తరలుతోంది. తాజాగా గుంటూరు జిల్లాలో  రెంటచింతల మండలంలోని సత్రశాల వద్ద సుమారు 1.6 లక్షల విలువైన అక్రమ మద్యం పట్టుబడింది.

తెలంగాణ నుంచి నుంచి ట్రాక్టర్ లో  తరలిస్తున్న 1200 వందల బాటిళ్లను అక్రమ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం రావడంతో ఎస్సై చల్లా సురేష్ తన సిబ్బంది మెరుపుదాడి చేసి  పట్టుకున్నారు.

అనంతరం  ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ శ్రీహరిబాబు మాట్లాడుతూ అక్రమంగా మద్యం రవాణా చేసి జీవితాలు నాశనం చేసుకోవద్దని కోరారు.మద్యం రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

డబ్బులకు ఆశపడి అక్రమ మద్యం రవాణా బాటను ఎంచుకుంటున్నారు. ఎక్సైజ్‌ తదితర కేసులలో పట్టుబడితే రౌడీషీట్లు తెరిచే అవకాశముంది. నిరుద్యోగులు అక్రమార్కుల వలలో చిక్కుకోవద్దని, వారి ఉజ్వల భవిషత్తును నాశనం చేసుకోవద్దని కోరుతున్నాం.

అలానే అక్రమ రవాణా విషయం తెలిసిన వారు తమకు సమాచారం ఇస్తే, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు ఈ సమావేశంలో రురల్ సిఐ ఉమేష్,తదితరులు పాల్గొన్నారు.