బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 మార్చి 2018 (09:12 IST)

మేఘాలయాలో హంగ్ అసెంబ్లీ.. పావులు కదుపుతున్న కాంగ్రెస్‌ - బీజేపీ

ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు తీర్పు విస్పష్టంగాలేదు. ఫలితంగా హంగ్ అసెంబ్లీ ఏర్పాటైంది. శనివారం ఉదయం వెల్లడైన ఈ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ 21 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్

ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు తీర్పు విస్పష్టంగాలేదు. ఫలితంగా హంగ్ అసెంబ్లీ ఏర్పాటైంది. శనివారం ఉదయం వెల్లడైన ఈ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ 21 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ, బీజేపీ మాత్రం కేవలం రెండో స్థానాలతో సరిపుచ్చుకుంది. 
 
కానీ, బీజేపీ భాగస్వామ్య పక్షం నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్.పి.పి) మాత్రం 19 స్థానాలతో అనూహ్యంగా పుంజుకుంది. ఈ ఎన్నికల్లో ఎన్‌పీపీ విడిగా పోటీ చేసింది. దీంతో మేఘాలయ రాజకీయం రసకందాయంలో పడిపోయింది. 
 
మొత్తం 60 స్థానాలు ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన మేజిక్‌ మార్కు 31. ఇతర ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి ముందు నుంచి చెబుతున్నట్లు కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో బీజేపీ పావులు కదుపుతోంది.
 
ఫలితంగా కాంగ్రెస్‌ ముఖ్య నేతలు ఆఘమేఘాలపై ఢిల్లీ నుంచి షిల్లాంగ్‌లో వాలిపోయారు. ఈ ఫలితాల్లో అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్‌ ఆవిర్భవించినా... ఆ పార్టీకి అధికారం పీఠం దక్కకుండా బీజేపీ తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని శనివారం రాత్రి పాగా పొద్దుపోయిన తర్వాత గవర్నర్‌ను కోరారు.