శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2020 (10:59 IST)

అనంతపురంలో మండుతున్న కూరగాయల ధరలు

అనంతపురంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కరోనా లాక్ డౌన్ సందర్భంగా అనేక మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తమ స్వగృహాలకు చేరుకుని దాదాపు ఐదు నెలలనుండి ఇంటి నుండే పనిచేస్తూ కుటుంబ సభ్యులతో తలిదండ్రులతో కలిసి ఉంటున్నారు.

ప్రతి రోజు ఉదయమే ఇంటిలోని పెద్దలకు బదులుగా వారే స్వయంగా వచ్చి కాయగూరలు కొనుగోలు చేసి తీసుకెళుతున్నారు. స్థానిక ధరలు తక్కువగా ఉన్నా కొందరు వ్యాపారులు వారు బేరమాడని వాలకాన్ని చూసి ధరలను అనూహ్యంగా అమాంతం పెంచేస్తున్నారు.

అలా పెంచిన వారు పని చేస్తున్న బెంగుళూరు, హైదరాబాదు, బొంబాయి, పూణే, కలకత్తా మొదలగు ప్రధాన నగరాల్లో వాళ్ళు గతంలో కోన్స్ ధరల కంటే పోల్చి చూసి తక్కువగా ఉన్న కారణంగా  కేజీలలో కొనుగోలు చేస్తున్నారు.

కొందరు వ్యాపారులు దీన్ని అవకాశంగా తీసుకొని అమాంతం ధరలను పెంచి అమ్ముతున్నందున మిగతా వ్యాపారులు కూడా అదే బాటలో నడుస్తున్నసందున సామాన్య బడుగు బలహీన ప్రజలకు పావు కిలో అర కిలో కొనాలన్న ధరల భారాన్ని మోయలేక పోతున్నారు.