1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 జులై 2021 (17:08 IST)

గ్రేడింగ్ విధానంలో ఇంటర్ ఫలితాలు.. ఎపుడంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాలు శుక్రవారం సాయంత్రం వెల్లడికానున్నాయి. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. 
 
కాగా కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలు రద్దు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉంటాయోనని విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు కూడా జరగలేదు. అయితే గ్రేడ్ల విధానంలో వారిని పాస్ చేసి సెకండియర్‌కు పంపారు. ఇప్పుడు ఇదే విధానంలోనే ఇంటర్ విద్యార్థులను కూడా పాస్ చేయనున్నట్లు తెలుస్తోంది.