ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 29 జనవరి 2017 (11:59 IST)

నా భర్తను చంపించింది జగన్ కాదా? పరిటాల సునీత ప్రశ్న

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై మంత్రి పరిటాల సునీత తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. జగన్ హత్యారాజకీయాలు చేశాడనేందుకు.. తన జీవితమే ప్రత్యక్ష ఉదాహరణ అంటూ మీడియాకు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభ

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై మంత్రి పరిటాల సునీత తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. జగన్ హత్యారాజకీయాలు చేశాడనేందుకు.. తన జీవితమే ప్రత్యక్ష ఉదాహరణ అంటూ మీడియాకు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తుంటే.. ఓర్వలేక జగన్‌ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి సునీత మండిపడ్డారు.

జగన్‌ పక్కనున్న సీనియర్‌ నాయకులు కూడా అదే పంతాలో పోతున్నారన్నారు. జగన్‌ జీవితంలో ముఖ్యమంత్రి అవ్వలేరని జోస్యం చెప్పుకొచ్చారు సునీత. ప్రత్యేక హోదా కోసం జగన్ ఇప్పుడు మాట్లాడడం హాస్యాస్పదమని తెలిపారు.
 
విశాఖ ఎయిర్ పోర్టులో తానే సీఎం అని జగన్ అంటున్న విషయాన్ని గుర్తు చేస్తూ.. జగన్‌ నిజంగా అధికారంలోకి వస్తే హత్యలే జరుగుతాయన్నారు. తన జీవితం ఇలా అవ్వడానికి కారణం వైఎస్ కుటుంబమేనని సునీత ఆవేశంగా అన్నారు. తన భర్తను చంపించింది జగన్ కాదా అని ప్రశ్నించారు. జగన్‌‌కు బుద్ది ఉంటే.. ప్రతిపక్షనేత పాత్ర పోషించి సీఎంకు సహకరించాలన్నారు. సీఎం పోస్టుకు జగన్ సెట్ కారని తెలిపారు.