సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 3 జూన్ 2019 (16:42 IST)

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థలపై సీఎం జగన్ కొరడా...? రివర్స్ టెండర్లేనా?

జలవనరుల శాఖపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషన్, పలువురు ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గాలేరు, నగరి ప్రాజెక్టులపై ప్రధాన చర్చ జరిగింది. 
 
పోలవరం ప్రాజెక్ట్ పైన కీలక నిర్ణయం సీఎం జగన్ తీసుకోనున్నట్టు సమాచారం. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండర్లు పిలిచే అవకాశం 
ఉన్నట్టు సమాచారం. 
 
రాష్ట్రంలో ప్రాజెక్టులు ప్రకటించి పనులు మొదలుపెట్టని వాటిపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సూచనలు చేశారు వైఎస్ జగన్. కృష్ణా, గోదావరి బేసీన్లో ప్రాజెక్టులపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.