సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 23 ఏప్రియల్ 2017 (14:52 IST)

హిందీ గో బ్యాక్ కథనం చాలా బాగుంది.. ప్రతి ఒక్కరూ చదవండి : పవన్ కళ్యాణ్ ట్వీట్

హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాది పెత్తనంపై మరోసారి మండిపడ్డారు. మంత్రులు, పార్టీ నేతలంతా ఇకపై హిందీలోనే మాట్లాడాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సూచన నేపథ్యంలో హిందీ గో బ్యాక్ అంటూ ఆంధ్రజ్యోతిల

హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాది పెత్తనంపై మరోసారి మండిపడ్డారు. మంత్రులు, పార్టీ నేతలంతా ఇకపై హిందీలోనే మాట్లాడాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సూచన నేపథ్యంలో హిందీ గో బ్యాక్ అంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని పవన్ తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.
 
ఉత్తరాది నేతలు ఇకనైనా పరిస్థితులను అర్థం చేసుకుని దేశంలో ఉన్న భిన్నసాంప్రదాయాలను గౌరవించాలని పవన్ కోరారు. ఆదివారం 'ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ పేజ్‌'లో ఇవాళ ప్రచురితమైన ‘హిందీ గోబ్యాక్’ అనే కథనాన్ని ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ కథనాన్ని చలసాని నరేంద్ర రాశారు. 
 
ఈ కథనం చాలా బాగుందని, ప్రతి ఒక్కరూ చదవాలని ఆయన కోరారు. ఉత్తరాది రాజకీయ నాయకులు మన దేశంలోని వివిధ ప్రాంతాల వైవిధ్యాన్ని గుర్తించాలని, అర్థం చేసుకోవాలని, గౌరవించాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.