ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2022 (18:05 IST)

జనవరి 12న 'యువశక్తి' పేరుతో జనసేన బహిరంగ సభ

janasena
హీరో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ 2024లో జరిగే ఎన్నికల కోసం పక్కా ప్రణాళికలతో ముందుకుసాగుతోంది. ఇందులోభాగంగా, ఇప్పటికే కౌలు రైతు భరోసా, జనవాణి కార్యక్రామాలను నిర్వహించగా, అవి విజయవంతమయ్యాయి. దీంతో తాజాగా యువశక్తి పేరుతో ఏపీలో బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. 
 
ఇందులోభాగంగా తన మొదటి సభను ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళంలో ఏర్పాటుచేయనున్నారు. ఈ సభలో జనసేన పార్టీ అదినేత పవన్ కళ్యాణ్ హాజరై ప్రసంగించనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ సభ ప్రారంభమవుతుందని జనసేన వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టరును విడుదల చేసింది. 
 
ఇందులో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై గళమెత్తడం కోసమే ఈ యువశక్తి సభలను నిర్వహిస్తున్నట్టు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ సభల ద్వారా రాష్ట్రంలోని యువతకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తామని, ఇలాంటి సభలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.