సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 25 మే 2019 (11:13 IST)

గెలుపోటములతో నిమిత్తం లేదు.. ప్రజాసేవే ముఖ్యం : జనసైనికులు

ఇటీవల వెల్లడైన ఏపీ శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. కానీ, తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి బరిలోకి దిగిన రాపాక వరప్రసాద్ మాత్రం గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధించారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ ఒక్క సీటుతో ఖాతా తెరిచింది. 
 
ఇదిలావుంటే, ఈ ఎన్నికల్లో ఓడిన తెదేపా నేతలు, శ్రేణులు పూర్తిగా నైరాశ్యంలో మునిగిపోయివుంటే.. వైకాపా కార్యకర్తలు, నేతలు మాత్రం విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు. కానీ, జనసేన సైనికులు మాత్రం ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. తద్వారా తమకు గెలుపోటములతో సంబంధం లేదని నిరూపించారు. 
 
"జనసైనికులంటే గెలిస్తే సంబరాలు చేసుకుని ఓడిపోతే నిరుత్సాహపడే వాళ్ళు కాదని గెలిచినా ఓడినా ఎప్పుడూ ప్రజలలోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటామని ప్రజలకు తెలియచేస్తూ "మార్పు కోసం జనసేన" కార్యక్రమంలో భాగంగా శనివారం కిర్లంపూడి మండలం శృంగరాయునిపాలెం గ్రామంలో  అనేక మంది జనసైనికులు డ్రైనేజీ కాలువల పూడికతీత పనుల్లో నిమగ్నమయ్యారు.