1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 24 మే 2019 (11:16 IST)

జనసేనకు షాక్.. జేడీకి చుక్కెదురు.. కారణం ఏమిటి?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో జనసేనకు చుక్కెదురైంది. అయితే వ్యక్తిగత ఇమేజ్‌తో విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గంలో దూసుకు వెళ్లిన జనసేన అభ్యర్థి, సీబీఐ మాజీ అధికారి వి.వి.లక్ష్మీనారాయణ మూడో స్థానానికి పరిమితమయ్యారు. నిజాయతీపరుడైన పోలీసు అధికారిగా పేరుండడం, ప్రచారం సందర్భంగా ఆయన నిరాడంబరత్వం విశాఖ ఓటర్లను ఆకట్టుకున్నాయి. 
 
దీంతో జేడీకే ఓట్లు రాలుతాయని అందరూ అనుకున్నారు. ఎన్నికల ప్రచార ప్రసంగాల్లో ఎక్కడా వ్యక్తిగత విమర్శలకు దిగకుండా హుందాగా వ్యవహరిస్తూ ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. తటస్థ ఓటర్లను ఇది బాగా ఆకట్టుకుంది. కానీ అనూహ్యంగా మూడో స్థానానికి పరిమితం కావడం జనసైనికులకు షాకిచ్చింది. 
 
ఇందుకు కారణం ఏమిటంటే.. నగర ఓటర్లలో ఒక వర్గం లక్ష్మీనారాయణను బాగానే ఆదరించినప్పటికీ, గ్రామీణ ప్రాంత ఓటర్లు, మురికివాడల్లోని ఓటర్లు టీడీపీ, వైసీపీ పట్ల మొగ్గు చూపడం ఆయనకు మైనస్‌ అయ్యింది. విశాఖ నగరంలో దాదాపు 700 వరకు మురికి వాడలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో జనసేనకు సరైన నాయకత్వ వ్యవస్థ లేకపోవడంతో ఆ పార్టీ కొంపముంచిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.