శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 జనవరి 2018 (09:54 IST)

24 గంటల ఉచిత విద్యుత్‌ను ఓ కేస్‌స్టడీగా తీసుకోవాలి : పవన్ కళ్యాణ్

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని జనవరి ఒకటో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తోంది. దీన్ని ఒక కేస్‌స్టడీగా తీసుకోవాలని జనసేన పార్టీ అధినే

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని జనవరి ఒకటో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తోంది. దీన్ని ఒక కేస్‌స్టడీగా తీసుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న 24 గంటల విద్యుత్ సరఫరా పథకాన్ని భారతదేశంలో ఒక కేస్‌స్టడీగా తీసుకోవాలని సూచించారు. 
 
ఇదే అంశంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, 24 గంటల విద్యుత్తు ఇస్తే వచ్చే ఎన్నికల్లో తెరాస తరపున ప్రచారం చేస్తానన్న ప్రతిపక్ష నేత జానారెడ్డి మాటలు తనకు గుర్తుకొచ్చాయన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తెరాసకి మద్దతిచ్చే ఆలోచన తనలు ఏమాత్రం లేదన్నారు. 
 
ఉద్యమం జరిగినప్పటి నుంచి తనకు కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిపై ఎంతో గౌరవం ఉండేదన్నారు. జనసేన ఆవిర్భావ సభలోనూ ఆ విషయాన్ని చెప్పానన్నారు. ఇప్పటికీ ఏపీలో జరిగే జనసేన సమావేశాల్లో ఈ విషయాన్ని చెబుతుంటానని గుర్తుచేశారు.