1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 జనవరి 2023 (13:45 IST)

రోజా నోటికి మున్సిపాలిటీ చెత్తకుప్పకి పెద్దగా తేడా లేదు..

nagababu
ఏపీ మంత్రి రోజాపై మెగా బ్రదర్, జనసేన నేత కొణిదెల నాగబాబు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌‌పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వారిపై ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా వీడియో రూపంలో రోజాపై మెగా బ్రదర్స్ మండిపడ్డారు. 
 
పర్యాటక శాఖ మంత్రి రోజా ది నోరు కాదు మున్సిపాలిటీ చెత్త కుప్ప అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టాప్ 20 ర్యాంకింగ్స్‌లో దేశంలో ఏపీ పర్యటక శాఖ 18వ స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు. రోజా బాధ్యతను విస్మరించి నోటికొచ్చినట్లు ఏదేదో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 
 
రాష్ట్ర పర్యటక శాఖ వల్ల ఎంతో మంది ప్రత్యక్షంగా పరోక్షంగా బ్రతుకుతున్నారని.. రోజా చేష్టల వల్ల వాళ్ల బ్రతుకులు మరింత దిగిజారిపోతున్నాయని మెగా బ్రదర్ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదని హితవు పలికారు. పర్యటక శాఖని ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచించాలని.. రోజా నోటికి మున్సిపాలిటీ చెత్తకుప్పకి పెద్దగా తేడా లేదంటూ మండిపడ్డారు. అందుకే ఆమె ఏం మాట్లాడినా పెద్దగా రియాక్ట్ కాలేదంటూ తెలిపారు.